గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను.. కాంగ్రెస్లోకి వెళ్లలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని క్లారిటీ ఇచ్చారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇచ్చిన నోటీసులపై వివరణ ఇచ్చిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి…నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని తెలిపారు.

కాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఊహించని షాక్ తగిలింది. ఈ తరుణంలోనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. సుప్రీం కోర్టు తీర్పుకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదట 5 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. వీరిని పిలిపించుకొని వివరణ తీసుకోనున్నారు స్పీకర్.