హిందూ సంప్రదాయంలో వినాయకుడికి ప్రత్యేకమై స్థానం ఉంది. ఎటువంటి పూజ చేసినా ఎటువంటి వ్రతాలు చేసిన వినాయకుడికి మొదటి పూజ అందుతుంది. వినాయకుడు విజ్ఞాలను తొలగించే దేవుడుగా భక్తుల మదిలో నిలిచిపోయాడు. ఇప్పటివరకు వినాయకుడు అంటే ఏనుగు తొండంతో కలిగిన ఆకారాలను మాత్రమే చూసి ఉంటాము. ఈనెల 27న వినాయక చవితి రానుంది ప్రతి పల్లెలో పట్టణాల్లో వీధుల్లో వినాయకుడి విగ్రహాలను పెట్టి భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. మరి ఈ సందర్భంగా మనం ఒక ప్రత్యేకమైన దేవాలయం గురించి తెలుసుకుందాం.. వినాయకుడు మానవ రూపంలో సాక్షాత్కరించిన పవిత్ర క్షేత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వినాయకుడు సకల విజ్ఞాన తొలగించే గణపతి, మానవ రూపంలో వెలిసిన పవిత్ర క్షేత్రం. తిరువూరు జిల్లాలోని తలతర్పణ పురిలో ఉన్న శ్రీ ముక్తేశ్వర్ ఆలయం ప్రాంగణంలో ఈ అనుపమానమైన నరముఖ గణపతి కొలువుదీరి ఉన్నాడు. ఈ ఆలయాన్ని నరముఖ గణపతి ఆలయం, వినాయకర్ ఆలయం అని పిలుస్తారు.

పురాణాల ప్రకారం పార్వతీదేవి స్నానం చేసినప్పుడు తన శరీరం పై ఉన్న మట్టితో ఒక బాలుడిని తయారు చేసి అతనికి ప్రాణం పోస్తుంది. ఈ బాలుడే ఆమెకు ద్వారపాలకుడిలా ఉంటాడు. ఆ తర్వాత శివుడు తిరిగి వచ్చినప్పుడు బాలుడు శివుని లోపలికి రానివ్వడు. దీనికి ఆగ్రహించిన శివుడు ఆ బాలుడు తల ఖండిస్తాడు. తర్వాత బాలుడు తన కుమారుడని తెలుసుకున్న శివుడు పార్వతీదేవి దుఃఖాన్ని తొలగించడానికి ఆమె కోరిక మేరకు ఏనుగు తలని ఆ బాలుడికి అతికించి తిరిగి ప్రాణం పోస్తాడు. అయితే శివుడు తల ఖండించక ముందు వినాయకుడు మానవ రూపంలోనే ఉన్నాడు. ఆ రూపానికి నిదర్శనంగా తిలతర్పణ పూరిలో ఈ ఆలయంలో వినాయకుడు తొలి రూపమైన మానవ ముఖంలో ఉన్న విగ్రహాన్ని పూజిస్తారు. ఈ ఆలయాన్ని దర్శిస్తే పితృ దోషాలు తొలగుతాయని, సంపదలు, సుఖం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ప్రత్యేకమైన ఆలయాన్ని దర్శించడం ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది.
ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఈ ఆలయంలో భక్తులతో కిటికీలాడుతుంది. గణపతి హోమం అభిషేకం వంటి ప్రత్యేక పూజలు భక్తులకు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని అందిస్తాయి. ఈ క్షేత్ర దర్శనం భక్తుల జీవితంలో మార్పులు తెస్తుందని భక్తులు నమ్ముతారు.