తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు అదే నెలకు సంబంధించిన వసతి బుకింగ్ కూడా ఓపెన్ కానుంది. నిన్న వృద్ధులు, దివ్యాంగుల కోటా టికెట్లను టీటీడీ సంస్థ విడుదల చేసిన సంగతి తెలిసిందే. భక్తులు ఎలాంటి పరిస్థితులలో దళారులను నమ్మవద్దని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.

ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ లేదా యాప్ లోనే బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు దాదాపు 12 గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. క్యూ లైన్లలో భక్తులు శ్రీవారి సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు.