వంగవీటి విగ్రహానికి పేడ కొట్టిన సంఘటనకు సంబందించిన సీసీ టీవీ పుటేజ్ బయటికొచ్చింది. కైకలూరు నియోజవర్గం కలిదిండి మండలం సానరుద్రవరంలోని వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పేడ పూశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది.

సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడిన పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ సంఘటనపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వంగవీటి విగ్రహానికి పేడ పూసిన వాళ్లను… వెంటనే అరెస్టు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
https://twiter.com/bigtvtelugu/status/1959473978751455417