ఇటీవల హైదరాబాద్ కూకట్పల్లి లో జరిగిన క్రికెట్ బ్యాట్ ఘటన దేశాన్ని కలచివేసింది. పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచింపచేసేలా చేసింది. 14 ఏళ్ల బాలుడు 10 ఏళ్ల బాలిక ఇంట్లో బ్యాట్ దొంగిలించే ప్రయత్నంలో పట్టుబడి ఆమెను 21సార్లు పొడిచి చంపాడు. ఈ ఘటన చిన్నారుల్లో పెరుగుతున్న హింస ప్రవర్తనకు దర్పణం. మానసిక, ఆరోగ్య సమస్యలు, కుటుంబ నిర్లక్ష్యం, మీడియా ప్రభావం, వంటి కారణాలు ఇందుకు దోహదపడుతున్నాయి. ఇది తల్లిదండ్రులు సమాజానికి హెచ్చరికలు. ఈ ఘటన పిల్లలను భక్తి, ఆధ్యాత్మిక విలువలతో పెంచాలని గుర్తుచేస్తుంది.
చిన్నారుల్లో హింస ప్రవర్తన పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మానసిక, ఆరోగ్య సమస్యలు ప్రధానం. వారిలో ఉండే భావోద్వేగా నియంత్రణ లోపం వంటివి, దూకుడు ప్రవర్తనకు దారితీస్తాయి. కుటుంబ పరిస్థితులు కూడా ఇందులో ఒక భాగం తల్లిదండ్రుల నిర్లక్ష్యం, హింస, డిప్రెషన్ పిల్లలను ప్రభావితం చేస్తున్నాయి. ఇంట్లో తరచూ గొడవలు తల్లిదండ్రుల మధ్య తగాదాలు ఉంటే పిల్లల్లో కోపం పెరుగుతుంది. పెద్దలు కోపం, కొట్టడం వంటి పద్ధతులను చూపిస్తే పిల్లలు దాన్ని అనుసరిస్తారు.
ఇక హింసను చూపించే సినిమాలు, వీడియో గేమ్స్, సోషల్ మీడియా కంటెంట్ల వల్ల పిల్లల మనసు హింస వైపుకు మల్లుతోంది. హీరోలు లేదా గేమ్ క్యారెక్టర్లు హింస ద్వారా సమస్యలు తక్షణమే పరిష్కరిస్తారని అందులో చూపించడం కూడా మరో ప్రభావంగా మారుతుంది. వారిలా మనం కూడా ఏదైనా ప్రాబ్లం లో ఇరుక్కుంటే బయటపడవచ్చు అని పిల్లలు అనుకుంటారు.

స్కూల్లో చిన్నతనంగా చూడడం, ఎగతాళి చేయడం వంటివి పిల్లలు హింసతో ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు. సరైన మార్గదర్శకత లేకుండా పీర్ ప్రెషర్ లోకి లోన దారి తప్పే అవకాశం ఉంటుంది. కోపం, అసహనం, అసూయ వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడం, చిన్న విషయానికి అధికంగా కోపాన్ని చూపించడం, వంటివి వారిలో ఉండే భావోద్వేగా నియంత్రణ లోపం కారణంగానే వస్తాయి. తల్లిదండ్రులు బిజీగా ఉండి పిల్లలతో మాట్లాడకపోవడం వాళ్ల సమస్యలు విని అర్థం చేసుకోకపోవడం వల్ల పిల్లలు కఠినంగా ప్రవర్తిస్తున్నారు.
పిల్లల్లో కోపాన్ని చిన్న సమస్యగా తీసుకోకూడదు ఇంటి వాతావరణం శాంతియుతంగా ఉండాలి. తల్లిదండ్రులు గొడవలు పిల్లల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. స్క్రీన్ టైం కి పరిమితులు పెట్టాలి. హింసను చూపే కంటెంట్ కి దూరంగా ఉంచాలి. స్కూల్లో కౌన్సిలింగ్ ఎమోషనల్ గైడెన్స్ తప్పనిసరి తల్లిదండ్రులు, గురువులు కలిసి పిల్లల పరివర్తన పై నిష్టంగా గమనిస్తూ ఉండాలి. పిల్లలకు హింస బదులు సహనం క్షమా వంటి విలువలు నేర్పించాలి.
చిన్నారులు హింస పెరుగుతోంది అనేది కేవలం వారి తప్పు కాదు కుటుంబం మీడియా, పాఠశాల వాతావరణం అనే మూడు కారణాలు దీనికి బలమైన పునాది వేస్తున్నాయని గుర్తించాలి.