నేడు ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ కోవిదులతో భేటీ కానున్నారు. న్యాయ కోవిదులతో చర్చించి వారి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. న్యాయపరమైన అవరోధాలు లేకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ చేయనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఢిల్లీ వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్. ఇక అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన హాస్టల్ ప్రారంభోత్సవంతో పాటు భవనాల నిర్మాణాలకు సంబంధించి భూమి పూజలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.