తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు హెచ్చరించింది వాతావరణ శాఖ. నేడు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ.

ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరిలో భారీ వర్షాలు పడనున్నాయి.. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వానలు వర్షాలు పడనున్నాయి. మరోవైపు, తెలంగాణలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఖమ్మం, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఎల్లో అలర్ట్ జారీ చేసింది IMD.