టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్యూట్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న వారిలో సమంత, నాగచైతన్య ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ ప్రేమించుకొని కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతులలో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్నారు. ఎంతో అన్యోన్యంగా వారి వైవాహిక జీవితం కొనసాగింది. చాలా సంతోషంగా ఉన్న ఈ జంట మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం ఎవరికివారు వారి లైఫ్ ను సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక నాగచైతన్య రెండవ వివాహం చేసుకొని ఎంతో సంతోషంగా ఉన్నారు. సమంత మాత్రం సింగిల్ గా తన లైఫ్ కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా… నాగచైతన్య, సమంత విడాకుల విషయంపై నాగచైతన్య మేనత్త నాగ సుశీల కీలక వాక్యాలు చేశారు. సమంత, చైతన్య వివాహం చేసుకుంటామని మమ్మల్ని అడిగినప్పుడు మేము వద్దని చెప్పలేదు. ఆ తర్వాత విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నామని చెప్పినప్పుడు కూడా మేము వద్దని చెప్పలేదు. మేము వారిద్దరిని ఎప్పుడూ నిందించలేదు. వారి నిర్ణయాన్ని పూర్తిగా వాళ్లకే వదిలేసామంటూ నాగ సుశీల అన్నారు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.