సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా అర్జున్ టెండూల్కర్ పెళ్లికి సంబంధించి ఊహాగానాలు వచ్చాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ అర్జున్ నిశ్చితార్థ విషయాన్ని ధృవీకరించారు సచిన్.

ఈ నెల 14న అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్‌కు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడించాడు. సానియా చందోక్ ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు అన్న సంగతి తెలిసిందే.