స్వాతి కేసులో నిందితుడు మహేందర్ రెడ్డి కుటుంబం ఇంకా పరారీలోనే ఉంది. స్వాతి మృతదేహం విడిభాగాల కోసం మూసీ నదిలో విస్తృత గాలిస్తున్నారు. మూసీ నది వరద ఉధృతి అధికంగా ఉండడంతో శరీర భాగాలు దొరకలేదు. హైదరాబాద్ నుంచి నేరుగా కామారెడ్డిగూడకు స్వాతి మృతదేహం తరలించారు.

నిన్న రాత్రి పోలీసు బందోబస్తు మధ్య స్వాతి అంత్యక్రియలు ముగిశాయి. కాగా రెండు రోజుల కిందట తన భార్యను అత్యంత కిరాతకంగా మహేందర్ హత్య చేశాడు. ప్రే మించి పెళ్లి చేసుకున్న స్వాతి పై అనుమానం పెంచుకొని ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది.