ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత… అన్ని రంగాల్లో పెను మార్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మండలానికి జనరిక్ మెడికల్ స్టోర్ ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట.

పేదలపై భారం తగ్గించేలా జెనరిక్ ఔషధాలు విస్తృతంగా అందుబాటులోకి తేవాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే మండలానికో జనరిక్ మెడికల్ స్టోర్ పెట్టేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిద్ధమైందట. ఈ స్టోర్ ల కోసం బీసీ కార్పొరేషన్ కు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అలాగే అనుమతులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో అతి తక్కువ ధరకే.. పేద ప్రజలకు మెడిసిన్ అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. అలాగే బీసీ యువతకు ఉపాధి కూడా కలుగుతుందని చెబుతున్నారు.