మహేష్ కుమార్ గౌడ్ చేసిన దొంగ ఓట్ల కామెంట్స్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. బ్రేకింగ్ న్యూస్ లు వస్తాయనే నన్ను తిడుతున్నారని ఆగ్రహించారు బండి సంజయ్. తెలంగాణలో ఓటు చోరీ లేదు, ఏం లేదని క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్.

అదే నిజం అయితే కర్ణాటకలో కూడా మేమే అధికారంలోకి వచ్చేవాళ్లం కదా ? అని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ మాకే పూర్తి మెజారిటీ వచ్చేది కదా? అని ఆగ్రహించారు. మహేష్ కుమార్ గౌడ్ గురించి కాంగ్రెస్ నేతలే నాకు ఫోన్ లు చేసి చెప్తున్నారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్.