తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 30వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈనెల 30వ తేదీ నుంచి ఏకంగా ఐదు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. కాలేశ్వరం కమిషన్ నివేదికను ఈ అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుందని తెలుస్తోంది.

అయితే కాలేశ్వరం కమిషన్కు సంబంధించిన నివేదిక అసెంబ్లీ ముందుకు వస్తున్న నేపథ్యంలో గులాబీ పార్టీ బాస్ కల్వకుంట్ల చంద్ర శేఖర రావు కూడా.. అసెంబ్లీ కి వస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. అటు కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చేం దుకు స్కెచ్ లు వేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే ఈసారి జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడివాడిగా జరగనున్నాయి.