ఏపీ కొత్త బార్ పాలసీకి స్పందన కరువు అయ్యింది. 840 బార్ లైసెన్లకు నోటిఫికేషన్ జారీ చేసిన ఎక్సైజ్ శాఖకు ఊహించని షాక్ తగిలింది. 840 బార్ లైసెన్లకు నోటిఫికేషన్ జారీ చేస్తే, ఇప్పటి వరకు కేవలం 90 మాత్రమే దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక నేటితో ముగియనున్న గడువు నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీలో బార్ లైసెన్స్ దరఖాస్తుల గడువు పొడిగించింది సర్కార్. దరఖాస్తుకు ఆగస్టు 29 సాయంత్రం 6 గంటల వరకు గడువు పెంచారు. ఈ నెల 30న ఉదయం 8 గంటలకు డ్రా నిర్వహణ ఉంటుంది. వినాయక చవితి సెలవు, వరదల కారణంగా గడువు పెంచారు. సవరణ షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ ఎక్సైజ్ శాఖ… దరఖాస్తుకు ఆగస్టు 29 సాయంత్రం 6 గంటల వరకు గడువు ఇచ్చింది.