మనకు రాత్రి నిద్రలో అనేక రకాల కలలు వస్తాయి అందుకు అనేక కారణాలు ఉంటాయి. సాధారణంగా, నిద్రలో మనకు వచ్చే కలలు ఎక్కువగా మళ్లీ నిద్ర లేచాక గుర్తుండవు. కానీ కొన్ని కలలు మనల్ని ఉలిక్కిపడేలా చేస్తాయి. ప్రత్యేకంగా, చదువుకునే పిల్లల్లో పరీక్షలకు సంబంధించిన కలలు ఎక్కువగా కనిపిస్తాయి. పరీక్షల సమయంలో ఆలస్యంగా చదువుతున్నట్టు, సిలబస్ మొత్తం మర్చిపోయినట్టు, సమాధానాలు అసలు గుర్తుండకపోయినట్టు కలలు వచ్చే సందర్భాలు తరచుగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఈ కలల స్ట్రెస్, ఆందోళన, మానసిక ఒత్తిడి వల్ల వస్తాయి. మన మెదడులో ఏర్పడిన భయాలు, కలల రూపంలో బయటకు వస్తాయి. మన మనసు మనకు చెప్పాలనుకున్న విషయం ఏమిటి? ఈ కలలు మన ఆందోళన ఎలా ప్రతిపాదిస్తాయో తెలుసుకుందాం..
సన్నద్ధంగా లేకపోవడం : చాలామంది విద్యార్థులు పరీక్షల టైం లో ఇలాంటి కల లను కంటారు. పరీక్షకు సిద్ధంగా లేకపోవడం లేదా ఏమి గుర్తు రాకపోవడం వంటి సన్నివేశాలను చూస్తుంటారు. ఇది నిజ జీవితంలో ఏదైనా ముఖ్యమైన పని లేదా సవాళ్లకు సిద్ధంగా లేమని మనసు భావించినప్పుడు ఆందోళన చెందుతున్నప్పుడు ఇలా సూచిస్తుంది. ఇది చదువుకు మాత్రమే కాకుండా ఒక కొత్త ఉద్యోగం లేదా ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మరేదైనా ముఖ్యమైన సందర్భాన్ని మనం ఫేస్ చేయబోయే ముందు ఇలాంటి కలలు రావడం సహజం.

నియంత్రణ కోల్పోవడం: ఎక్కువమంది కలలో ఆలస్యంగా పరీక్షకు వెళ్లడం, పరీక్ష హాల్ కనపడక వెతుక్కుంటున్నట్లు కంగారుగా పరీక్షలకు వెళ్తున్నట్టు కలగంటూ ఉంటారు. మన జీవితంలో మనం నియంత్రణ కోల్పోయినప్పుడు అది మన మనసు భావించినప్పుడు ఇలాంటి కలలు వస్తాయి ఇది ఒక నిర్దిష్ట పరిస్థితి పై మనకు ఆధారం లేదని, మనం నిస్సహాయంగా ఉన్నామని సూచిస్తుంది.
ఆత్మవిశ్వాసం లేకపోవడం: పరీక్షలు కలలో తరచుగా వస్తుంటే అందుకు ఆత్మవిశ్వాసం తగ్గిందని చెప్పొచ్చు మనం మన సామర్థ్యాల్ని సందేహించినప్పుడు మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటున్నప్పుడు ఇలాంటి కలలు వస్తాయి. మనసు ఏది ఏమైనా నేను ఇప్పుడు ఆ పని చేయలేను అనే భయాన్ని సూచిస్తుంది.
గత అనుభవాలు : కొన్ని సందర్భాల్లో ఈ కలలు గతంలో జరిగిన పరీక్షలకు సంబంధించిన అనుభవాల ఆధారంగా,లేదా భవిష్యత్తులో అలాంటి తప్పులు చేయకుండా ఉండాలని ఆలోచనను సూచిస్తాయి.
ఈ కలలు మన మనస్సు, మనలోని ఆందోళన భయాలను, పరిష్కరించుకోవాలని సూచించే ఒక సంకేతంగా పనిచేస్తాయి. వాటిని అర్థం చేసుకోవడం ద్వారా మనం మనలోని మానసిక ఒత్తిడికి గల కారణాలను తెలుసుకొని వాటిని అధిగమించడానికి ప్రయత్నించవచ్చు.