ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళలకు మరో శుభవార్త చెప్పింది ఆర్టీసీ సంస్థ. వినాయక చవితి సందర్భంగా… కీలక ప్రకటన చేసింది. ఆర్టీసీకి త్వరలోనే 1500 ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు రాబోతున్నట్లు ఆర్టీసీ ఎం డి ద్వారాక తిరుమలరావు ప్రకటన చేశారు. స్త్రీ శక్తి పథకం ద్వారా వాటిలో కూడా ఉచిత ప్రాయాణం కల్పిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.

మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్న నుంచి.. వచ్చే సమస్యలపై దృష్టి పెట్టి వాడిని పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఒక రాష్ట్రంలో వచ్చిన సమస్యలు ఇక్కడ తలెత్తకుండా చూస్తున్నామని వివరించారు. డిమాండ్ ఉన్నచోట ఆర్టీసీ బస్సులను పెంచుతామని కూడా ప్రకటన చేశారు ద్వారకా తిరుమలరావు. ఆర్టీసీ బస్సుల డిమాండ్ పెరిగితే కచ్చితంగా తాము ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచుతామని వివరించారు. ఈ విషయంలో ఏపీ మహిళలు టెన్షన్ పడకూడదని కోరారు.