చిన్నారులలో కఫం అనేది సాధారణ సమస్య, ముఖ్యంగా శీతాకాలంలో వాతావరణం మారినప్పుడు ఇది ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లలు మాట్లాడలేరు కాబట్టి వారికి అసౌకర్యంగా ఉన్నప్పుడు మరింత చికాకుగా ఉంటారు. అయితే దీనికి వెంటనే వైద్యుడు వద్దకు వెళ్లకుండా ఇంట్లోనే కొన్ని సులభమైన చిట్కాలను పాటించి పిల్లలకవం తగ్గించవచ్చు. ఈ ఇంటి చిట్కాలు పిల్లలకు ఉపశమనం కలిగించడంతోపాటు వారికి ఇబ్బంది లేకుండా చూస్తాయి. అయితే ఒకవేళ కఫం ఎక్కువగా ఉండి ఇతర లక్షణాలు కనిపిస్తే వైద్యుని సంప్రదించడం చాలా ముఖ్యం. అయితే ఇంటిలోనే తగ్గించుకునే చిట్కాలను మనము చూద్దాం..
వేడి పానీయాలు, ఆవిరి పట్టడం : ఒక సంవత్సరం పైబడిన పిల్లలకు వేడి నీటిలో కొద్దిగా తేనె కలిపి ఇవ్వవచ్చు. తేనె గొంతు నొప్పిని తగ్గించి కఫాన్ని పల్చగా మారుస్తుంది. అంతేకాక పిల్లలకు వేడి నీటి ఆవిరి ఉన్న గదిలో ఉంచడం లేదా స్నానం చేయించడం వల్ల ఊపిరితిత్తుల్లోని కఫం తేలికపడి సులభంగా బయటికి వస్తుంది.
ముక్కు దిబ్బడ తగ్గించడం : మెడికల్ షాప్ లో లభించే నాసిల్ డ్రాప్స్ ఉపయోగించి ముక్కుదిబ్బడను తగ్గించవచ్చు. ఇది ముక్కులోని పొడి కఫాన్ని పల్చగా మార్చి శ్వాస సులభం చేస్తుంది. అంతేకాక గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఆ నీటిని ముక్కు దగ్గర ఆవిరి పెట్టడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గుతుంది.

ఇతర చిట్కాలు: ఆవనూనెలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేడి చేయాలి ఆ నూనె చల్లారాక పిల్లల చాతి వీపు భాగం పై సున్నితంగా మసాజ్ చేయాలి ఇది గొంతు ఛాతి వద్ద రక్తప్రసరణ మెరుగుపరిచి కఫం తగ్గిస్తుంది.
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి ఇవ్వాలి పసుపులో ఉండే కర్కు మీన్ కఫాన్ని తగ్గించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది. అంతేకాక పిల్లలకు నీటి పదార్థాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల శరీరం డిహైడ్రేషన్ అవకుండా ఉంటుంది. సూప్ లు ఇవ్వడం వల్ల కఫం తేలికపడి బయటకు వస్తుంది.
ఒకవేళ పిల్లల్లో కఫం ఎక్కువగా ఉండి జ్వరం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం ముఖ్యం. ఇంటి చిట్కాలు కేవలం అదనపు ఉపశమనం కోసం మాత్రమే వైద్య సలహా తప్పనిసరిగా తీసుకోవాలి