ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాడి రైతులకు ప్రభుత్వం శుభవార్త అందజేసింది. పశుగ్రాసం కోసం పాడి రైతులు 20 శాతం చెల్లిస్తే, ప్రభుత్వం 80% రాయితీ అందిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ బీమా మూడు సంవత్సరాల పాటు ఉంటుందని ఆ సమయంలో పశువులు అకాల మరణం చెందితే రూ. 30,000 బీమా పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. గొర్రెలు, మేకలు ప్రమాదవశాత్తు మరణించినట్లయితే రూ. 6,000 బీమా వస్తుందని పశుసంవర్ధక శాఖ పేర్కొంది.

కాగా, ఇప్పటికే పశువులకు 50% రాయితీతో దాణ అందిస్తున్నారు. దీంతో పాడి రైతులు పశువులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీలోని పాడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీని అభివృద్ధి చేసే దిశగా అనేక రకాల పథకాలను అమలులోకి తీసుకువస్తున్నారు. ఇప్పుడు పశువుల కోసం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపీ ప్రజలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.