శివుడు ఎందుకు నవరాగ్రహాల అధిపతి? తెలుసుకోవాల్సిన రహస్యాలు!

-

హిందూ పురాణాల ప్రకారం శివుడు విశ్వానికి సమస్త సృష్టికి అధిపతి. కేవలం దేవతలకే కాదు గ్రహాలకు వాటి కదలికలకు వాటి ప్రభావాలు కూడా ఆయన అధిపతిగా పరిగణించబడతారు. హిందూ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో నవగ్రహాలు మానవ జీవితం పై ప్రభావం చూపే గ్రహ శక్తులుగా పరిగణించబడతాయి. ఈ నవగ్రహాలకు అధిపతిగా శివుడు ఉంటాడని అందరూ అనుకుంటారు. అసలు ఎందుకు శివుడు మాత్రమే నవగ్రహాలకు అధిపతిగా ఉండాలని ఎప్పుడైనా ఆలోచించారా? శివుడు సర్వం సృష్టించి పోషించి సర్వశక్తిమంతునిగా భావించబడతాడు. నవగ్రహాల ఆయన ఆధీనంలో పనిచేస్తాయని ఆయన ఆజ్ఞలను అనుసరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అసలు శివుడు నవగ్రహాల అధిపతిగా ఎలా గుర్తించబడ్డాడు దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణాలను తెలుసుకుందాం..

నవగ్రహాలు-శివుడు : నవగ్రహాలు అంటే సూర్యుడు, చంద్రుడు, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు కేతువు గా మనం చెప్పుకుంటాం. ఇవి మానవ జీవితంలోని కర్మ ఫలితాలను ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అయితే శివపురాణం ప్రకారం ఈ గ్రహాలు శివుడి ఆధీనంలో ఉంటాయి. శివుడు సర్వాధిపతి, సర్వంతర్యామి కావడంతో గ్రహాలు ఆయన ఇష్టానికి లోబడి పని చేస్తాయి. శని దేవుడు కూడ శివుడి తపస్సుకులోనే ఆయన ఆజ్ఞలను పాటించినట్టు పురాణాలు చెబుతున్నాయి.

శివ స్వరూపం: ఈశ్వరుడు సృష్టి, స్థితి లయకారకుడిగా భావించబడతాడు. నవగ్రహాల ఆయన సృష్టిలోని భాగమై జీవుల కర్మ ఫలితాలు నిర్ణయిస్తాయి. శివుడి మహాదేవుడిగా గ్రహాల ప్రభావాన్ని నియంత్రించే శక్తి కలిగి ఉంటాడు. ఆయనను ఆరాధించడం ద్వారా నవగ్రహ దోషాల నుంచి విముక్తి పొందవచ్చు అని భక్తులు విశ్వసిస్తారు.

Why Is Lord Shiva Called the Ruler of Navagrahas?
Why Is Lord Shiva Called the Ruler of Navagrahas?

ఆధ్యాత్మిక కోణం : శివుడు నవగ్రహాల అధిపతిగా భావించబడటం వెనుక ఆధ్యాత్మిక కారణం ఉంది ఆయన సమస్త శక్తులకు గ్రహాలు కేవలం ఆయన ఆజ్ఞలను అమలు చేసే సాధకాలు మాత్రమే, శివాష్టకం రుద్రాష్టకం వంటి స్తోత్రాలు ఆయన సర్వాధికారాన్ని వివరిస్తాయి. శివారాధన ద్వారా గృహ పీడలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.

నవగ్రహాలు మన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాయి. కానీ ఆ కర్మల ఫలితాలను మార్చగల శక్తి వాటి ప్రభావాన్ని తగ్గించే శక్తి కేవలం ఈశ్వరుడుకి మాత్రమే ఉంటుంది. అందుకే నవగ్రహ దోషాలు, గ్రహదోషాలు జ్యోతిష్య సమస్యలు ఉన్నప్పుడు మహా శివుని పూజించడం రుద్రాభిషేకం చేయడం వల్ల ఆ సమస్యలు తగ్గుతాయని నమ్ముతారు. సకల గ్రహాలను వాటి కదలికను వాటి ప్రభావాలను నియంత్రించే శక్తి మహా శివునికి మాత్రమే ఉండడంవల్ల ఆయనను నవగ్రహాల అధిపతిగా పిలుస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news