వినాయకుడి విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్ద హిజ్రాల హల్‌చల్

-

హిజ్రాలు హల్‌చల్ చేస్తున్నారు. వినాయకుడి విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్ద హిజ్రాల హల్‌చల్ కొనసాగుతోంది. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో డిండి రోడ్డుపై వినాయకుడి విగ్రహాలను తరలిస్తున్న ప్రతీ వాహనానికి అడ్డుపడి డబ్బులు వసూలు చేసారు హిజ్రాలు.

hizra
Hijras throng at Ganesha idol purchase centers

డబ్బులు ఇవ్వకపోతే వాహనాన్ని కదలనివ్వం అని దౌర్జన్యం చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు స్థానికులు. కొత్తగా పెళ్లిళ్లు, నూతన గృహప్రవేశం, ఇతర శుభ కార్యాలయం నేపద్యంలో కూడా హిజ్రాలు ఇంటికి వచ్చి మరి రచ్చ చేస్తారు. ఇక ఇప్పుడు వినాయకుల మండపాలు, కొనుగోలు కేంద్రాల వద్ద కూడా రచ్చ చేస్తున్నారు హిజ్రాలు. డబ్బులు ఇవ్వకపోతే ప్రైవేట్ పాటలు చూపించి మరి రెచ్చిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news