భారీ వర్షాల ఎఫెక్ట్… కేటీఆర్ కు ఫోన్ చేసిన కేసీఆర్

-

భారీ వర్షాల వల్ల వరదలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కలగడం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేసారు. ఈ తరుణంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫోన్ చేసారు KCR. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ నుండి ఖమ్మం దాకా పలు జిల్లాల్లో వరదలతో నివాసాలు నీట మునిగి, రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ అతలాకుతలమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావడం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

KCR
KCR called party working president KTR

వరద ప్రభావిత జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యనేతలకు అధినేత ఫోన్లు చేసి ఈమేరకు అప్రమత్తం చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ తమవంతుగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ దిశగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అధినేత కేసీఆర్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news