రేవంత్ ఏం దేవుడు కాదు.. అంటూ రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న వినాయకుడిపై రాజాసింగ్ ఫిర్యాదు చేశారు. వెంటనే మండపాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి లేఖ రాసారు రాజాసింగ్. గోషామహల్ నియోజకవర్గంలోని అఘాపూరలో సీఎం రేవంత్ రెడ్డి గెటప్‌లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసారు ఎమ్మెల్యే రాజాసింగ్.

సీఎంపై గౌరవంతో దాన్ని ఏర్పాటు చేసినా ఆయన తమకు దేవుడు కాదని పేర్కొన్నారు రాజాసింగ్. ఇలాంటి చర్యలు హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీస్తాయని, మత విశ్వా సాలను గౌరవించాలని కోరారు రాజాసింగ్.
ఇది ఇలా ఉండగా, రేవంత్ రెడ్డి గెటప్‌లో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసారు. హైదరాబాద్ – గోషామహల్ నియోజకవర్గం అఘాపూరలో రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసారు ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్.