ఖాళీ స్థలాలకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కోట్లు దోచుకుంటన్నారు అక్రమార్కులు. పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగలేని వృద్ధుల భూములే టార్గెట్ పెట్టుకున్నారు. హైదరాబాద్ – యాదగిరిగుట్ట మార్గంలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి, వాటిని కబ్జా చేసి, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి వాటిని ఇతరులకు విక్రయిస్తున్న 8 మంది ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
రాంపల్లి, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు కబ్జా చేసి, నకిలీ డెత్ సర్టిఫికెట్లు, ఈసీ, సేల్ డీడ్ సృష్టించి అక్రమంగా భూములను విక్రయిస్తున్న బీగుడెం అరవింద్, సంపంగి సురేష్ అలియాస్ పవన్, ఈగ హరిప్రసాద్, చెక్కల సోమనాథ్ అలియాస్ సోమయ్య, కొట్ల నాగేంద్ర ప్రసాద్ అలియాస్ రఘునాథ్ రెడ్డి, మిర్ మొహమ్మద్ హుస్సేన్ అనే 8 మందిని అరెస్ట్ చేసారు పోలీసులు. మరో 13 మంది పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు పోలీసులు.