ఏపీలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు అల్లూరి, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. మన్యం, ఉభయగోదావరి, కోనసీమ, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడులో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

మిగతా జిల్లాల్లో జల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. అల్పపీడన ప్రభావం చతిస్గడ్, ఒడిశా వైపు కదిలే అవకాశం ఉందని APSDMA పేర్కొంది. మరోవైపు వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. భవనాలు నేలమట్టమవుతున్నాయి. పాత భవనాలు, ఇళ్లలో ప్రజలు ఎట్టి పరిస్థితులలో ఉండరాదని అధికారులు స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాలలో ప్రజలు వారి ప్రాణాలను కాపాడుకునేందుకు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. రోడ్లన్నీ నీటితో నిండిపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.