సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు తీవ్ర అనారోగ్యం నెలకొందని అంటున్నారు. లాంగ్ లీవ్ పెట్టిన సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్.. 31 జనవరి 2026 వరకు సెలవులో ఉండనున్నారు. సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్ పెట్టిన తరుణంలో ఆమె స్థానంలో సెర్ప్ అదనపు సీఈఓగా కాత్యాయనీ దేవికి అదనపు బాధ్యతలు అప్పగించింది తెలంగాణ సర్కార్.

అనారోగ్య కారణాలతో బాధపడుతున్నట్లు, త్వరలోనే కోలుకుంటానని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసారు స్మితా సబర్వాల్. కాళేశ్వరం, కంచ గచ్చిబౌలి భూముల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న స్మితా సబర్వాల్…. లాంగ్ లీవ్ పెట్టడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రాధాన్యత లేని పోస్టింగ్స్, ఇబ్బందికర పరిస్థితులు కారణంగా లాంగ్ లీవ్ పెట్టి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
Sometimes the quietest seasons of our life, speak to us the loudest.
A personal update:
The past few months have been a slow, painful recovery from a vertebral artery dissection that shook my world!It’s been tough – but I’m healing. Building resilience.
One day at a time. ❤️🩹 pic.twitter.com/NLwYtAf22p— Smita Sabharwal (@SmitaSabharwal) August 28, 2025