టాలీవుడ్ కమెడియన్ లోబోకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. లోబకు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది కోర్టు. 2018 సంవత్సరంలో జనగామ జిల్లా రఘునాథపల్లి సమీపంలో… కమెడియన్ లోబో కారు ఢీ కొట్టి ఏకంగా ఇద్దరు మరణించారు. ఇందులో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. అయితే ఈ సంఘటనపై ఇంకా కేసు కొనసాగుతూనే ఉంది.

ఇలాంటి నేపథ్యంలోనే జనగామ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది కోర్టు. లోబోకు ఏడాది కాలం పాటు జైలు శిక్ష అలాగే 12,500 జరిమానా ఇవ్వాలని ఆదేశించింది జనగామ కోర్టు. ఓ వీడియోలు చిత్రీకరణ కోసం లోబో బృందం రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు సందర్శన అనంతరం తిరుగు ప్రయాణంలో జరిగిన ఈ ప్రమాదంపై.. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది.