వరద బాధితులను తిట్టిన కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు

-

కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. మా ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తావా లం* కొడకా! అంటూ కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. వరదల్లో ఇల్లు మునిగిపోయాయి.. నా భార్య గర్భిణీ.. మా పరిస్థితి ఏంటని ఆవేదనతో మాట్లాడితే లం* కొడకా అంటూ కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనుచరులు తిట్టినట్లు ఓ వ్యక్తి వీడియో వైరల్ గా మారింది.

kamareddy
Kamareddy BJP MLA’s followers scold flood victims

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు నీట మునిగి అవస్థ పడుతుంటే, బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు కాలనీ వాసులు. ఎమ్మెల్యే పట్ల అసహనం వ్యక్తం చేసినందుకు వరద ముంపు కాలనీలో ఒక వ్యక్తికి ఫోన్ చేసి ల** కొడకా అంటూ దూషించారట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే అనుచరుడు విపుల్ జైన్. నా భార్య గర్భిణీ.. వరదల్లో తమను పట్టించుకోవడం లేదని కోపంలో ఎమ్మెల్యే పట్ల అసహనం వ్యక్తం చేస్తే బూతులు తిడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు బాధితుడు.

Read more RELATED
Recommended to you

Latest news