ఏపీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పించింది చంద్రబాబు కూటమి సర్కార్. ఇలాంటి నేపథ్యంలోనే ఏపీ ఆర్టీసీ బస్సులో తాను చున్నీ వేసిన సీటులో ఓ పురుషుడు కూర్చున్నాడని బూతులతో రెచ్చి పోయింది మహిళ. ఈ తరుణంలోనే ఇరువురు చెప్పులతో కొట్టుకున్నారు.

నా సీటులో ఎందుకు కూర్చున్నావ్, ఎవడ్రా నువ్వు.. నీకు సిగ్గు లేదా అంటూ బూతులు తిట్టింది ఆ మహిళ. అతడి తలపై కొడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ.. అతడు సీటులో నుంచి లేచే వరకు వదలేదు మహిళ. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.