ఉచిత బస్సు… ఇకపై మహిళలకు స్మార్ట్ కార్డులు

-

ఏపీలో మహిళలకు ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. “స్త్రీ శక్తి” పేరుతో ఈ పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. ఆగస్టు 15వ నుంచి మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. అయితే ఈ పథకం విజయవంతంగా అమలు అవుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం కోసం త్వరలోనే మహిళలకు స్మార్ట్ కార్డులను అందజేయనున్నట్లుగా తెలియజేశారు.

free bus
It was announced that smart cards will be provided to women.

ఇప్పటివరకు ఈ పథకం అమలు కోసం రూ. 95 కోట్లు ఖర్చు చేసినట్లుగా వెల్లడించారు. త్వరలోనే కొత్త బస్సులు కూడా అందుబాటులోకి రాబోతున్నాయని స్పష్టం చేశారు. 60% మంది మహిళలు ఆర్టీసీ ఎక్కుతున్నారని పేర్కొన్నారు. ఉచిత బస్సు వల్ల మహిళలు ఎలాంటి చార్జీలు లేకుండా ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పథకం వల్ల ఆటోడ్రైవర్లు భారీగా నష్టపోతున్నారని త్వరలోనే వారి కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news