నేడు కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఇవాళ ఉదయం 11.00 గంటలకు పరమ సముద్రం చెరువు వద్ద జల హారతి ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 11.15 గంటలకు పరమ సముద్రం చెరువు పక్కనే సీఎం చంద్రబాబు బహిరంగ సభ లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు పారిశ్రామికవేత్తలతో అవగాహనా ఒప్పందాలు ఉంటాయి.

ఇక అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీపై ప్రత్యేక దృష్టి పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఇవాళ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా పార్టీ కార్యకర్తలతో సమావేశమైన పవన్ కళ్యాణ్… ఇవాళ విశాఖ వేదికగా జనసేన సభను నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో… విశాఖపట్నంలోని ప్రియదర్శి మైదానం లో సభ ప్రారంభం కానుంది. ఈ సభ నేపథ్యంలో సాయంత్రం 6 గంటలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుంది