గణపతి బప్పా మోరియా కావలయ్యా యూరియా… BRS రచ్చ రచ్చ

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సమస్య ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయాన్నీ గులాబీ పార్టీ తెరపైకి తీసుకువచ్చింది. ఇవాల్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఇవాళ్టి నుంచి కేవలం మూడు రోజులపాటు మాత్రమే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి.

KTR
BRS MLAs and MLCs protest with empty urea bags at Gun Park

ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యంగా… గణపతి బప్పా మోరియా కావలయ్యా యూరియా అంటూ నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలు. గన్ పార్క్ వద్ద ఖాళీ యూరియా సంచులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయ్యిదంటూ ఆందోళన చేసారు. ప్లకార్డుల ప్రదర్శిస్తూ యూరియా కొరత తీర్చాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. నిరసనలో ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్, సుధీర్ రెడ్డి, గంగుల, వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, తక్కల్లపల్లి రవీందర్రావు, తాత మధు, సిరికొండ మధుసూదనాచారి తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news