మా అత్తయ్య గారు.. అంటూ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

-

మా అత్తయ్య గారు.. అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. తాజాగా అల్లు అరవింద్ తల్లి మరణించారు. అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అర్జున్ నానమ్మ తాజాగా మృతి చెందారు. అల్లు కనకరత్నమ్మ 94 సంవత్సరాల వయసులో… మృతి చెందారు.వృద్ధాప్యం కారణంగా… అల్లు కనక రత్నమ్మ మరణించినట్లు చెబుతున్నారు. ఇవాళ ఉదయం రెండు గంటల సమయంలో…. ఆమె మరణించినట్లు చెబుతున్నారు. ఈ తరుణంలోనే చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ చేసారు.

Chiranjeevi's emotional post saying My mother-in-law
Chiranjeevi’s emotional post saying My mother-in-law

మా అత్తయ్య గారు.. కీ.శే అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం అన్నారు. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం అని పేర్కొన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను… ఓం శాంతిః అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news