సరూర్ నగర్ భర్త హత్య కేసులో ట్విస్ట్… డంబెల్స్‌తో కొట్టి భార్య చిట్టి

-

సరూర్ నగర్ భర్త హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డంబెల్స్‌తో కొట్టి భర్తను భార్య చిట్టి చంపింది. కొద్దికాలం క్రితమే భార్య చిట్టికి పరిచయమయ్యాడు ప్రియుడు హరీష్. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీయడంతో, భార్య చిట్టిని మందలించాడు భర్త శేఖర్. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని పడుకున్నాక ప్రియుడు హరీష్‌ను ఇంటికి పిలిపించింది చిట్టి.

పడుకున్న శేఖర్ గొంతు నులిమాడు హరీష్.. భర్త ప్రతిఘటించడంతో డంబెల్స్‌తో తలపై కొట్టి చంపింది చిట్టి. ఉదయం అవ్వగానే పోలీసులకు ఫోన్ చేసి, తన భర్త రాత్రి ఎవరితోనో గొడవపడి వచ్చి పడుకున్నాడు.. ఉదయం చనిపోయాడు అని చెప్పింది భార్య. ఆమె తీరుతో అనుమానం వచ్చి విచారించగా, ఇద్దరం కలిసి చంపినట్లు ఒప్పుకుంది చిట్టి. నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం మాదారం గ్రామానికి చెందిన శేఖర్‌తో చిట్టికి 2009లో వివాహం అయింది. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉండగా.. కూతురు హాస్టల్లో ఉంటూ చదువుకుంటుండగా, హత్య జరిగిన రోజు కుమారుడిని వినాయకుడి దగ్గర పడుకోమని పంపించింది చిట్టి.

Read more RELATED
Recommended to you

Latest news