సచివాలయం దగ్గర BRS ఎమ్మెల్యేలు ధర్నా చేసే ప్రయత్నం చేసారు. యూరియా కొరతపై సెక్రటేరియట్ ముందు నిరసన తెలిపేందుకు యత్నించారు. అయితే యూరియా కొరతపై తెలంగాణ సచివాలయం వద్ద బైఠాయించి ధర్నా చేసేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేశారు.

ఇక అరెస్ట్ జరుగుతున్న నేపథ్యంలోనే హరీష్రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను జీతాలు పెరిగాయా? వాహనాల్లో కొట్టిస్తున్న పెట్రోల్ డబ్బులు ఇస్తున్నారా? అని నిలదీశారు. టీఏ, డీఏలు వచ్చాయా అంటూ సమస్యలు అడిగి తెలుసుకున్న హరీష్ రావు… పోలీసులకు చుక్కలు చూపించారు.
యూరియా కొరతపై తెలంగాణ సచివాలయం వద్ద బైఠాయించి ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు https://t.co/1U8uEl3M8A pic.twitter.com/iLNPyo0Aaw
— Telugu Scribe (@TeluguScribe) August 30, 2025