హిందూ సాంప్రదాయంలో ఏకాదశి తిధికి విశేష ప్రాముఖ్యత ఉంది. అయితే వాటిలో కొన్ని ప్రత్యేకమైనవి అలాంటి వాటిలో ఒకటి పరివర్తన ఏకాదశి ఆషాడశుద్ధ ఏకాదశి ని శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజున యోగ నిద్రలోకి వెళ్లిన విష్ణుమూర్తి ఈ భగవత్ పరివర్తన ఏకాదశి రోజున తన భంగిమను మార్చుకుంటారని నమ్మకం అందుకే దీనిని పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ పరివర్తన ఏకాదశి సెప్టెంబర్ 3 న ఈ సంవత్సరం వచ్చింది. ఈ రోజున ఉపవాసం ఉండడం విష్ణువులు ఆరాధించడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది. ఏకాదశి విష్ణుభక్తులకు ఒక పండుగ లాంటిది. ఇది ఆధ్యాత్మిక పురోగతికి ఒక మంచి సందర్భముగా పురాణాలు చెబుతున్నాయి.
విష్ణు పరివర్తన ఏకాదశి ప్రాముఖ్యత : బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం ఈ రోజున విష్ణుమూర్తి వామనుడి రూపంలో బలి చక్రవర్తిని దర్శించి, మూడు అడుగుల భూమిని దానం అడిగి మూడు లోకాలను ఆక్రమించి బలిని పాతాళ లోకానికి పంపారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విష్ణువు యొక్క విశ్వరూపాన్ని ఆయన శక్తిని సూచిస్తుంది. ఈ రోజున చేసే ఉపవాసం దానధర్మాలు పూజలు అన్నీ పాపాలను తొలగిస్తాయని కోరిన కోరికలు నెరవేరుస్తాయని భక్తుల విశ్వాసం. దీనిని పార్శ్వ ఏకాదశి అని కూడా అంటారు.

ఇక ఈరోజున సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉపవాసం ఉండడం శ్రేయస్కరం పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు పండ్లు, పాలు సాత్విక ఆహారం తీసుకోవచ్చు. ఇక ఈ ఏకాదశి విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రపటాన్ని పూజించి తులసి ఆకులతో అలంకరిస్తారు. విష్ణు సహస్రనామం, శ్రీమద్ భాగవతం పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. అంతేకాక ఈరోజు పేదలకు ఆహారం వస్త్రాలు దానం చేయడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం. తెలిసి తెలియక చేసిన తప్పులకు భగవంతుని క్షమాపణ కోరుకుంటే అవి తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
విష్ణు పరివర్తన ఏకాదశి ఒక సాధారణ ఏకాదశి మాత్రమే కాదు ఇది భక్తులకు ఆధ్యాత్మిక చింతన విష్ణు పై తమ భక్తికి ప్రగాఢం చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం ఈరోజున ఉపవాసం పూజలు, దానాలు చేయడం ద్వారా మనసును శుద్ధి చేసుకుని భగవంతుని కృపకు పాత్రులు కావచ్చు.
గమనిక:పైన ఇచ్చిన సమాచారం హిందూ సంప్రదాయాలు పురాణాలు ఆధారంగా ఇవ్వబడింది.