తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో మహిళలు తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. కేవలం ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ పొందుతున్నారు. అయితే కొంతమంది మహిళలు వారి ఆధార్ కార్డులలో రాష్ట్రం పేరు ఏపీ అని ఉంటే బస్ కండక్టర్లు మహిళలకు జీరో టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.

దీనిపై గ్రేటర్ ఆర్టిసి ఈడి రాజశేఖర్ రియాక్ట్ అయ్యారు. ఆధార్ కార్డుపై తెలంగాణ లోకల్ అడ్రస్ ఉంటే సరిపోతుందని చెప్పారు. ఒకవేళ కండక్టర్లు మహిళలకు జీరో టికెట్ ఇవ్వడానికి నిరాకరించినట్లయితే 04069440000 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. వీలైనంతవరకు మహిళలు ఆధార్ కార్డులో తెలంగాణ అని మార్పించుకుంటే మంచిదని రాజశేఖర్ పేర్కొన్నారు. కాగా తెలంగాణలో ఉచిత బస్సు పథకం సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. దీంతో మహిళలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.