బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు రేపు లండన్ నుంచి హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. లండన్ నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి అధినేత కేసిఆర్ తో బేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ తో చర్చించిన అనంతరం కవిత చేసిన పలు ఆరోపణలపై హరీష్ రావు స్పందించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కవిత రేపు మేధావులతో మీటింగ్ జరిపించడానికి సిద్ధమయ్యారు.

కాగా, హరీష్ రావు కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిపించారని, పార్టీని హస్తగతం చేసుకునేందుకు కుట్రలు చేసినట్లుగా కవిత ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నాన్న అన్నను కాపాడు అంటూ కవిత హాట్ కామెంట్స్ చేసింది. నాలానే కేటీఆర్ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేలా చేస్తారంటూ కవిత ఆరోపించారు. కవిత చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఈరోజు సాయంత్రం లోపు హరీష్ రావు కవిత చేసిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.