YSRCP MP Mithun Reddy : జైలులో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ లభించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి ఇస్తూ.. బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు. అనంతరం ఈ నెల 11వ తేదీన తిరిగి సరెండర్ అవ్వాల్సిందిగా మిథున్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.

లిక్కర్ కేసులో.. రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మిథున్ రెడ్డి. రెండు కిందటనే లిక్కర్ కేసులో.. రాజమండ్రి జైలుకు వెళ్లారు. దీంతో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుటుంబంలో అలజడి చోటు చేసుకుంది. అటు రాజమండి జైలులో ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా మిథున్ రెడ్డి చేశారు జైలు అధికారులు. కోర్టు ఆదేశాల మేరకు వీఐపీ ఏర్పాట్లు ఉన్నాయి.