తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కలకలం చోటుచేసుకుంది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో… ఉత్తంకుమార్ రెడ్డి కుటుంబం సమావేశమైంది. తాజాగా బెంగళూరు వెళ్లిన ఉత్తంకుమార్ రెడ్డి అలాగే ఆయన సతీమణి ఎమ్మెల్యే పద్మావతి ఇద్దరు కూడా… డీ కే శివ కుమార్ ఇంటికి వెళ్లారు.

ఈ సందర్భంగా డికె శివకుమార్ దంపతులతో…. ఉత్తంకుమార్ రెడ్డి అలాగే పద్మావతి ఇద్దరు కూడా సమావేశం అయ్యారు. దాదాపు గంట సమయం.. పాటు వీళ్ళ మధ్య సమావేశం జరిగినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా డీకే శివకుమార్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ అలాగే కర్ణాటక రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ పనితీరుపై డీకే శివ కుమార్ ఆరా తీసినట్లు చెబుతున్నారు.