ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త. మరో 4 రోజుల్లోనే ఏపీ ప్రజల అకౌంట్లో.. ఉపాధి హామీ డబ్బులు తమ కాబోతున్నాయి. ఉపాధి హామీ స్రామికుల వేదన బకాయిలు చెల్లించేందుకు మోడీ ప్రభుత్వం 1668 కోట్లు రిలీజ్ చేసింది. ఈ డబ్బులు మరో నాలుగు రోజుల్లోనే… లబ్ధిదారుల ఖాతాలలో జమ కాబోతున్నాయి.

ఈ నిధులతో మే 15వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు.. చెల్లించాల్సిన బకాయిలు తీరుతాయని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. మిగిలిన చెల్లింపుల కోసం దాదాపు 140 కోట్ల అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. బకాయిలు చెల్లించాలని పదేపదే.. కేంద్రానికి ఏపీ సర్కార్ లేఖ రాయడంతో ఈ నిధులు విడుదలయ్యాయి.