ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల కొడుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి రానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగానే.. షర్మిల వేస్తున్న అడుగులు కూడా ఇదే సంకేతాన్ని తెలియజేస్తున్నాయి.

ఇవాళ కర్నూలు ఉల్లి మార్కెట్కు తల్లితో సహా సందర్శనకు వెళ్లారు షర్మిల కొడుకు రాజారెడ్డి. ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్న రాజారెడ్డి… ఇవాళ కర్నూలు ఉల్లి మార్కెట్కు తల్లితో సహా సందర్శనకు వెళ్లారు. దీంతో త్వరలో వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే.. రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి వస్తే.. ఏ పార్టీలో చేరతారనేది కూడా ముఖ్యమైన అంశమే. ప్రాథమిక సమాచారం ప్రకారం… కాంగ్రెస్ పార్టీలో చేరతారని అంటున్నారు.