యూరియా కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళా రైతులు

-

యూరియా కోసం క్యూ లైన్ లో గొడవపడి చెప్పులతో కొట్టుకున్న మహిళా రైతుల వీడియో వైర‌ల్ గా మారింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డు ముందు మహిళా రైతులు బారులు తీరారు. ఈ త‌రుణంలోనే… క్యూ లైన్లలో రైతుల మధ్య కొట్లాటలు చోటు చేసుకున్నాయి. యూరియా కోసం రైతులను రోడ్లమీదికి తెచ్చిన సీఎం రేవంత్…అంద‌రికీ గొడ‌వ పెట్టిస్తున్నాడ‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

urea
Video of women farmers fighting and hitting each other with slippers in a queue for urea goes viral

ఇక అటు ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను పట్టుకుని యూరియా కోసం లైన్ కట్టింది. ముఖ్యంగా ఇందులో జ్వరంతో ఉన్న కూతురిని కూడా తీసుకువచ్చింది. అయినప్పటికీ ఆ చిన్నారికి సిరప్ తాగిస్తూ యూరియా కోసం లైన్ కట్టింది మహిళ రైతు. ఈ సంఘటన… హనుమకొండ జిల్లా పరకాల రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతుల అవస్థలు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news