బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి 563 గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నాడని బాంబ్ పేల్చారు. కచ్చితంగా రేవంత్ రెడ్డి మీద సీబీఐ ఎంక్వయిరీ వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నానన్నారు. గ్రూప్-1 కేసులో హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం అంటూ ఫైర్ అయ్యారు.

దీంట్లో అక్రమాలు జరిగాయని కోర్టే చెప్పింది.. అందుకే బండి సంజయ్ గారు సీబీఐ ఎంక్వయిరీ వెయ్యమని కోరాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కాగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేసింది. ఇప్పటివరకు ప్రకటించిన గ్రూప్–1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల పేపర్లను రీవాల్యుయేషన్ చేసి, దాని ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. ఒకవేళ సాధ్యం కాకపోతే, పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.