వీరనారి చాకలి ఐలమ్మ జయంతి…KTR షాకింగ్ ట్వీట్ వైర‌ల్

-

వీరనారి చాకలి ఐలమ్మకు జోహార్లు అంటూ బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చాకలి (చిట్యాల) ఐలమ్మ గారు తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిదర్శనం అన్నారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన విప్లవ నిప్పుకణిక ఐలమ్మ, భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసి ప్రజా వ్యతిరేక పాలనపై దండెత్తిందని పేర్కొన్నారు.

KTR chakali
KTR chakali

చాకలి ఐలమ్మ పోరాటాలను, త్యాగాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతిని ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని వివ‌రించారు. బహుజన చైతన్యానికి, మహిళా ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నానన్నారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news