ప్రభుత్వ ఆఫీసుల్లో పవన్ కళ్యాణ్ ఫోటో వద్దు…హై కోర్టు కీల‌క తీర్పు !

-

ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కల్యాణ్ ఫోటోను ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడంపై పిల్ దాఖలు అయింది. చట్టబద్ధమైన అనుమతులు లేకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తూ రైల్వే విశ్రాంత ఉద్యోగి పిటీషన్ దాఖలు చేశారు.

pawan kalyan
pawan kalyan

ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోల ప్రదర్శనపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని రూపొందించే వరకు కార్యాలయాల నుంచి పవన్ కళ్యాణ్ ఫోటోలను తొలగించేలా ఆదేశాలను జారీ చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ విషయం పైన నేడు విచారణ జ‌రిగింది. విచారణ అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను ఫోటోల ప్రదర్శనపై క్లారిటీ ఇచ్చింది హై కోర్టు. ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కల్యాణ్ ఫోటోను ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసిన హైకోర్టు….డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటుపై నిషేధం ఎక్కడ ఉందని ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో పిటిషన్ వేశారంటూ కొట్టివేసింది. సమాజానికి పనికొచ్చే ప్రజాహిత వ్యాజ్యాలు వేయాలని కోర్టు సూచనలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news