తెలంగాణ సెక్రటేరియట్‌లో ఇంటర్నెట్ బంద్ అయింది. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగడం వల్ల ఉదయం నుంచే పలు శాఖల్లో పనులు నిలిచిపోవడం ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. పలు శాఖల్లో ఉదయం నుంచి ఇంటర్నెట్ సర్వీస్‌లు నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.

అయితే, ఏ కారణంతో ఇంటర్నెట్ నిలిచిపోయిందనేది కూడా ఉద్యోగులకు తెలియకపోవడం గమనార్హం. కొందరు మాత్రం సాంకేతిక కారణాలతోనే సేవల్లో అంతరాయం కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఇక అటు ప్రభుత్వం ఇంటర్నెట్ కేబుల్ వైర్లను కట్ చేయడం ఆపాలంటూ జీహెచ్ఎంసీ పరిధిలో కేబుల్ ఆపరేటర్ల ధర్నా చేస్తున్నారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఈ విషయంలో దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు కేబుల్ ఆపరేటర్లు.