తమిళనాడులోని కళ్ళ కురిచిలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తన భార్య, ఆమె ప్రియుడిని అతి కిరాతకంగా నరికి చంపేశాడు. మొండాల నుంచి తలలు వేరు చేసి అతికిరాతకంగా చంపేశాడు. వారి తలలు తీసుకొని వెల్లూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. దీంతో అక్కడ ఉన్న పోలీసులు షాక్ కు గురై వెంటనే నిందితుడి ఇంటికి వెళ్లి చూడగా అతని భార్య ప్రియుడి మొండాలు మాత్రమే ఉన్నాయి. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాగా, నేటి కాలంలో అక్రమ సంబంధాలు పెట్టుకుని స్త్రీలు దిగజారి ప్రవర్తిస్తున్నారు. అక్రమ సంబంధాల కారణంగా భర్తలను హత్య చేయడం నేటి కాలంలో మహిళలకు చాలా కామన్ అయిపోయింది. ఇలాంటి ఘటనలు జరుగుతున్న సమయంలో భర్తనే భార్య, ఆమె ప్రియుడిని నరికి చంపడం గమనార్హం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కఠినమైన చట్టాలు అమలులోకి వచ్చినప్పటికీ స్త్రీలు పురుషులు ఇలా హత్యలు చేయడం చాలా దారుణమని అంటున్నారు.