పిఠాపురంలో టిడిపి నేత PVSN వర్మ తృతిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. నిన్న వర్మ కాకినాడ ఉప్పాడ తీరంలో పర్యటించారు. సముద్రపు అలలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు వర్మను అప్రమత్తం చేశారు. ఆ సమయంలో సముద్రంలో పెద్ద ఎత్తున వర్మపై వలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అలల తాకిడికి వర్మ అదుపుతప్పి నీటిలో పడబోయాడు.

వెంటనే అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా వర్మను గట్టిగా పట్టుకున్నారు. అంతేకాకుండా బీచ్ రోడ్డు మీదుగా వెళ్లే ప్రయాణికులు సైతం చాలా ఇబ్బందులు పడుతున్నారు. కెరటాల దాటికి రోడ్లపైన వెళ్లలేకపోతున్నారు. నీటి ప్రవాహం అధికంగా ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. కెరటాలు ఎక్కువగా వచ్చినప్పుడు కాసేపు ఆగి నెమ్మదిగా వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. మరోవైపు ఏపీలో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.