ఆదిలాబాద్ కలెక్టరేట్ భవనం పైకప్పు కూలడంతో ఉద్యోగులకు సెలవు ఇచ్చారు. ఈ మేరకు ఉద్యోగులకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ రాజర్షి షా. భవనం శిథిలమైనందున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కలెక్టరేట్ ప్రధాన ద్వారానికి తాళం వేశారు సిబ్బంది. దీంతో తాత్కాలికంగా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాలు మూతపడ్డాయి.

ఆదిలాబాద్ జిల్లాలో 1941లో నిర్మించిన భవనంలోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. స్లాబ్ కూలడం గమనించి పరుగులు తీయడంతో ప్రమాదం నుండి బయటపడ్డారు ఉద్యోగులు. మంత్రి జూపల్లి సమీక్ష ఉండడంతో, అందరు ఉద్యోగులు అందుబాటులో ఉన్న సమయంలో భవనం పైఅంతస్తు కూలింది. స్లాబ్ నెమ్మదిగా కూలడం గమనించి బయటికి పరుగులు తీయడంతో, ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకున్నారు ఉద్యోగులు. ఈ తరుణంలోనే కలెక్టరేట్ సేవలకు తీవ్ర అంతరాయం నెలకొంది. ఫైల్స్ తొలగిస్తున్నారు అధికారులు.