తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలర్ట్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రమాదమైన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో… తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఇవాళ… నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి జిల్లాలో… భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.

రేపటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు అదిలాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్పపీడన ప్రభావం కారణంగా…. ఏలూరు, ఎన్టీఆర్ పల్నాడు, ప్రకాశం కర్నూలు నంద్యాల జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ… పేర్కొంది. ఇలాంటి నేపథ్యంలో ప్రజలందరూ అలర్ట్ గా ఉండాలని కూడా కోరింది.